calender_icon.png 31 March, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య

28-03-2025 08:46:42 AM

 రాజేంద్రనగర్,(విజయక్రాంతి): పెళ్లి విషయంలో అసంతృప్తి, అనంతరం తీవ్ర మానసిక ఎక్కడికి లోనైనా ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధి(Narsingi Police Station Area)లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సబితా రే కర్మాకర్(22), శుభజిత్ రే కర్మాకర్ దంపతులు రెండు నెలల క్రితం తమ నాలుగేళ్ల కుమారుడు అన్షు కర్మాకర్  తో కలిసి నార్సింగికి వలస వచ్చి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటున్నారు. సబిత హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నది.

ఇదిలా ఉండగా గురువారం ఉదయం శుభజిత్ పని నిమిత్తం భార్య, కొడుకును ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బాలుడు అన్షు కర్మాకర్ తమ ఇంటికి సమీపంలో ఉండే సబితా రే కర్మాకర్ సోదరి అంజలి రాయిదాస్ ఇంటికి పలుమార్లు వెళ్ళాడు. దీంతో ఆమె సబిత ఫోన్ కు కాల్ చేసినా స్పందించలేదు. అనుమానించిన అంజలి వెంటనే సబిత ఇంటికి చేరుకొని చూడగా బయటనుంచి లోపలి నుంచి  తలుపులు వేసి ఉన్నాయి. వెంటనే అనుమానించిన ఆమె కిటికీలో నుంచి చూడగా సబిత ఓ ఇనుప రాడ్డుకు టవల్ తో ఉరివేసుకొని మిగత జీవిగా కనిపించింది. స్థానికుల సమయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే వివాహం అనంతరం సబితా అసంతృప్తిగా ఉందని, ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఆమె సోదరి అంజలి రేదాస్ పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.