calender_icon.png 13 December, 2024 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషం సేవించి వివాహిత ఆత్మహత్య..!

13-12-2024 01:29:33 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): భార్య భర్తల మధ్య కలహాల నేపథ్యంలో వివాహిత విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(29) సాప్ట్ వేర్ ఇంజనీర్. ఐదు నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన మొవ్వ మనోజ్ మణికంఠతో వివాహమైంది. మనోజ్ కాంట్రాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ మియాపూర్ లోని  గోకుల్  ప్లాట్స్ లో ఉంటున్నారు.

వెంకట నాగలక్ష్మి విషం తాగడంతో గమనించిన ఇంటి యజమాని కుటుంబసభ్యులు కేపీహెచ్బీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మిని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. భర్త వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందిందని ఆమె తండ్రి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.