calender_icon.png 15 March, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

15-03-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, మార్చి 14(విజయక్రాంతి): అదనపు కట్నం  వేధింపులు తాళ లేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సం ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన సప్న, అమ్రేష్ దంపతులు అత్తాపూర్ లోని పాండురంగ నగర్ లో నివాసం ఉంటున్నారు.

వీరికి ఏడాదిన్నర కూతురు ఉంది. అమ్రేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ సమయంలో అత్తింటి వారు అమరేష్ కు బంగా రం, నగదు ఇచ్చారు. కూతురు పుట్టిన తర్వా త అమ్రేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక ఆమె గురువారం సాయంత్రం ఇంట్లో చున్నీతో ఉరివేసుకుంది.

ఈ విష యం గమనించిన ఆమె భర్త అమ్రేష్ వెంట నే సప్న సోదరుడు  నాగశెట్టికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాగశెట్టి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం తెలిపారు.