04-04-2025 12:03:03 AM
గుడిహత్నూర్ (విజయక్రాంతి): మండలంలోని గురుజ గ్రామానికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గురుజ గ్రామానికి చెందిన నైతం కరుణ (23) కు ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామం చెందిన నైతం లక్ష్మణ్ తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కరుణ వారం రోజుల క్రితం తల్లిగారి గ్రామమైన గురుజ కు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్త్స్ర తెలిపారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు.