27-04-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 26(విజయ క్రాంతి): చెరువులో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పూజా గుప్తా(35), జై సింగ్ గుప్తా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుండిగల్ తండా2 లో గత కొన్నాళ్లుగా నివాసముంటూ,ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
గాగిల్లాపూర్ చెరువులో ఓ మహిళా మృతదేహం ఉందని పెట్రోల్ మొబైల్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్య కు గల కారణమని పోలీసులు భావిస్తున్నారు.భర్త జై సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ పి. సతీష్ తెలిపారు.