19-04-2025 11:58:22 PM
తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఘటన
చెన్నై: తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. విరుధాచలం సమీప కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ విశ్రాంత రైల్వే ఉద్యోగి. న్యాయ విద్య చదువుతున్న ఆయన రెండో కుమారుడు అప్పు విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూడో సంవత్సరం విద్యార్థిని విజయశాంతి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. అంతిమయాత్రకు ముందే ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుట ఆమెకు అప్పు తాళి కట్టారు. పుట్టెడు దుఃఖంలోను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారిని ఆశీర్వదించారు. అమ్మాయి తరఫు వారు గైర్హాజరయ్యారు.