బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ తాజాగా ప్రేమ, రిలేషన్‌షిప్ వ్యవహారాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన మనసులో మాటలను బయటపెట్టారు. రూపం కంటే వ్యక్తిత్వం ముఖ్యమని తేల్చి చెప్పారు. కొన్ని విషయాల్లో తన ముక్కుసూటి వ్యవహారశైలి తనకు మంచి బంధాలను ఏర్పరుచుకోవడంలో సహకరించిందని పేర్కొన్నారు. థిండర్ సైడ్ రైడ్‌లో భాగంగా భూమి మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు.
ప్రేమ అనేది ఒక నిజమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో సహకరిస్తుందని తెలిపారు. “నేను ఒక మంచి వ్యక్తిని చూసి తప్పక పెళ్లి చేసుకుంటా. ఇక మీదట నేను మరోసారి ఎప్పుడూ సంతోషమనేదే లేని రిలేషన్‌షిప్‌లో కొనసాగబోను. తొందరేమీ లేదు. ఎంత ఆలస్యమైనా మంచి వ్యక్తిని చూసుకునే పెళ్లి చేసుకుంటా. అది రేపైనా కావొచ్చు..
లేదంటే పదేళ్లు, అదీ కాదంటే 20 ఏళ్లునా పట్టొచ్చు“ అని భూమి వెల్లడించారు. మొత్తానికి అమ్మడు ప్రేమ పెళ్లే చేసుకుంటానని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ గోవా బీచ్‌లో రియా కపూర్, ఆమె భర్త కరణ్ బూలానితో కలిసి తెగ ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం భూమి ‘డాల్‌డాల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. దీనిలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.