calender_icon.png 11 February, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

11-02-2025 07:03:24 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచకు చెందిన కటారు ప్రశాంతి (36) సోమవారం అర్ధరాత్రి క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఆమె, సోమవారం రాత్రి భర్తతో స్వల్ప వివాదానికి మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని మృతి చెందింది. భర్త రవి శేఖర శాస్త్రి ఉదయం లేచి చూసే వరకు భార్య ఫ్యాన్ కు వేలాడుతుండటంతో నిర్గాంతపోయి కిందికి దింపాడు. అప్పటికే ప్రశాంతి మృతి చెందింది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. మృతురాలి బాబాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీస్ లు కేసు నమోదు తెలియజేస్తున్నారు.