నిర్మల్: జిల్లా సోన్ మండల కేంద్రం మాదాపూర్ గోదావరి పుష్కరాలు వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు కాపాడారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ కు చెందిన ఓ వివాహిత ఇంట్లో గొడవలు జరగడంతో తన కూతుర్ని తీసుకుని బయటకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సోను గోదావరి వద్ద అనుమానస్పదంగా ఓ మహిళ తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ శాఖ 100 నెంబర్ కు కాల్ చేయగా పోలీస్ సిబ్బంది శేఖర్ పృథ్వీధర్ అక్కడికి వెళ్లి వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు