రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కరీంనగర్, నవంబరు 10 (విజయక్రాంతి): జగిత్యాలలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు అన్న, అ తడి స్నేహితురాలి మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. జగిత్యాల పట్టణంలోని హను మాన్ వాడకు చెందిన రాయమల్లు తన కూతురికి హనుమకొండకు చెం దిన యువకుడితో వివాహం జరిపించారు. శనివారం రాత్రి హను మకొండలో రిసెప్షన్‌కు హాజరయ్యా రు. అర్ధరాత్రి తర్వాత రాయమల్లు, తన భార్యతోపాటు కుమారుడు సం కీర్త్, అతని స్నేహితురాలు రాజీతో కలిసి జగిత్యాలకు కారులో తిరుగు పయనమయ్యారు.
మరో ఐదు నిమిషాల్లో జగిత్యాలకు చేరుతారనుకునే సయమంలోనే ఆదివారం తెల్ల వారుజామున 4:30 గంటలకు జగిత్యాల ప్రధాన రహదా రిపై ధరూర్ వద్ద కారు అదుపుతప్పి జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంకీర్త్, రాజీ అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో కూర్చున్న రాయమల్లు, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కేసు దర్యాప్తు చేస్తున్న రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.