07-04-2025 12:00:00 AM
ముషీరాబాద్/వారసిగూడ/కార్వాన్, ఏ ప్రిల్ 6 (విజయక్రాంతి): సీతారాముల కల్యా ణం మహోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. నియోజకవర్గంలోని ముషీరాబాద్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్ పూ ర్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్‌లో వైభవం గా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించా రు. సందర్భంగా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భక్తి పారవశ్యం వెళ్లి విరిసింది.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జై సింహ, సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రవి చారి, రచన శ్రీ, పావని వినయ్ కుమార్ హాజరై సీతారాముల కళ్యాణం కళ్యాణాన్ని తిలకించారు.
అనంతం అనంతరం అన్నదాన కార్యక్రమాలు, షర్బత్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఆంజనేయులు, బీఆర్‌ఎస్ నేతలు బింగి నవీన్ కుమార్, వై. శ్రీనివాస్ రావు, శంకర్ ముదిరాజ్, రాకేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్యామ్ యాదవ్ ఎన్ డి సాయి కృష్ణ,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
* ముషీరాబాద్ నియోజకవర్గంలోని నారాయణగూడ, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియ ర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవ నిర్వాహకులు నగేష్ ముదిరాజును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జెల్లా బిక్షపతి రమేష్ శ్రీహరి సురేష్ దినేష్ పాల్గొన్నారు.
* వారసిగూడ పరిధిలో అన్ని ఆలయాలు భక్తులతో కిట కిట లాడాయి. బౌద్ధనగర్ లోని శ్రీ ఉమా చంద్రమౌళి రామాలయం లో శ్రీరామ నవమి సంద ర్భంగా సీతారామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగాజరిపించారు. భక్త జనలు ఉదయం నుంచి ఆలయ.లో శ్రీరామ చంద్రుడిని మనసారా పూజించి తరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందచేశారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, హనుమాన్ గుప్త స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
త్రివేణి సంగమ ఆలయంలో నయన మనోహరం..
చారిత్రాత్మక లంగర్ హౌస్‌లోని త్రివేణి సంగమ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యం లో వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు లంగర్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
సుమారు 30 వేల మంది కళ్యాణ వేడుకలకు హాజరయ్యారు. అధ్యంతం దశరథ తనయుడి నామ జపంతో త్రివేణి సంగమం మారుమోగింది. అనంతరం మధ్యాహ్నం భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. రాత్రి లం గర్ హౌస్‌లోని పురవీధుల మీదుగా స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఊరేగించారు. ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.