calender_icon.png 27 December, 2024 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణం.. కమనీయం

05-12-2024 12:00:00 AM

అక్కినేని నాగ చైతన్య వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకొన్న ఈ జంట ఐదో రోజు వివాహ బంధంతో ఒక్కటైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వివాహ వేదికలో హిందూ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:13 గంటలకు శోభిత మెడలో నాగచైతన్య తాళి కట్టారు.

అర్ధరాత్రి వరకూ పెళ్లికి సంబంధించిన క్రతువు కొనసాగింది. ఈ వివాహం అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. చిరంజీవి, టీ సుబ్బిరామిరెడ్డి తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఇంకా ఇరు కుటుం బ సభ్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.