- భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో విషాదం
- పెళ్లి ఇష్టం లేదని ఉరివేసుకున్న వధువు
హనుమకొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి): నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఇంటిల్లిపాది, బంధువులు పెళ్లి పనుల్లో మునిగి ఉండగా పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకున్నది. ఆ కు టుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ వి షా టదకర ఘటన జయశంకర్ భూపాలప లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో శ నివారం వెలుగు చూసింది. పోలీసులు, మృ తురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం... గ్రామానికి చెందిన బటికె సంపత్ దం పతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితమే వివాహమైంది. చిన్నకుమార్తె కోమల (25) మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నది. కోమలకు ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చి వరపూజ కూడా చేశారు.
తర్వాత జరిగిన పరిణా మాల నేపథ్యం లో కోమల పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆ సం బంధాన్ని రద్దు చేసుకున్నారు. ఇటీవల పోచారానికి చెందిన యువకుడితో కోమలకు పెండ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 28న వివాహం ఘనంగా జరిపించేందుకు తల్లిదండ్రులు, బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో తన గదిలో కోమల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమార్తె ఉరేసుకొని విగతజీవిగా కనింపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.