19-02-2025 12:30:24 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 18: మరో 15 రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన వీఎం. సాయికుమార్ (32)కు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి మార్చి 6న పెళ్లి నిశ్చయమైంది.
సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తాను చనిపోతున్నట్లు వీడియో రికార్డు చేసి బంధువులకు పంపించాడు. దీంతో బంధువులతో పాటు కుటుంబసభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట చౌరస్తా వద్ద చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు.
స్థానికులు వెంటనే భాస్కర్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సాయి కుమార్ ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి, ఆమె బాబాయి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.