calender_icon.png 1 March, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ మానవ హక్కుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా మర్రి మహిపాల్

01-03-2025 08:01:06 PM

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా జనగామ గ్రామానికి చెందిన మర్రి మహిపాల్ ను శనివారం నియమించారు. వరంగల్, హనుమకొండ జిల్లాలో హరిత కాకతీయ హోటల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ జాతీయ చైర్మన్ డా.మహమ్మద్ యాసిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మర్రి మహిపాల్ ను నియమించారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిటీ చైర్మన్ బద్దిపడగా శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా చైర్మన్ మర్రి మహిపాల్ జాతీయ మానవ హక్కుల కమిటీనీ మరింత ముందుకు తీసుకు పోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గాను తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి మన జాతీయ చైర్మన్ డాక్టర్: మహమ్మద్ యాసిన్ కి చెప్పడంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మర్రి మహిపాల్ నీ నియమించడం జరిగిందని తెలిపారు. అనంతరం  మర్రి మహిపాల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇట్టి బాధ్యతను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్ర రావు EC మెంబర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చైర్మన్ కే శివ రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, అనిల్, మోహన్, నవీన్, బిబిపేట మండల అధ్యక్షుడు బోదాస్ సాయికుమార్ పాల్గొన్నారు.