మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో పత్తి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడూర్ మండలంలోని ఇంద్రకళ్ శివారులోగల మణికంఠ జిన్నింగ్ మిల్ వద్ద ఏర్పాటుచేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తేమ తరుకు పేరుతో పత్తి రైతులను సిసిఐ నిర్వాహకులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తద్వారా రోజుల తరబడి పత్తి రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు.
పత్తి నాణ్యతగా ఉన్నప్పటికీ రైతులను ఇబ్బందుల గురిచేస్తూ దళారులు తీసుకొచ్చే ప్రతిని మాత్రం దర్జాగా కొంటున్నారని మండిపడ్డారు. అధికారుల సైతం పర్యవేక్షణ చేయకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది హిస్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓవైపు పత్తి రైతులు చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పత్తి రైతులకు మోసం జరిగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.