* జయంతి కార్యక్రమంలో పలువురు వక్తలు
ముషీరాబాద్, జనవరి 13: ప్రజల మనిషి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ వాదానికి, నినాదానికి ఆదిలోనే పునాది వేసిన మహోన్నత వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్క్ రాక్ గార్డెన్స్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి కే జనారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మర్రి చెన్నారెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, కుటుంబ సభ్యులు హాజరై చెన్నారెడ్డి సమాది వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.