calender_icon.png 24 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనితీరు ఆధారంగా హాస్టళ్లకు మార్కులు

24-11-2024 02:35:25 AM

రెండు రోజుల్లో జిల్లాలోని 164 వసతిగృహాలను తనిఖీ చేయాలి

అధికారులకు కలెక్టర్ అనుదీప్ ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23(విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతి అందేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకులాల అధికారులు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా 2 రోజుల్లో జిల్లాలోని 164  వసతి గృహాలను తనిఖీ చేసేలా.. 82మంది ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించారు. వీరిలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు ఉన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు హాస్టళ్లను సందర్శించి విద్యాబోధన ఎలా ఉంది, స్టోర్ రూమ్, వంట పాత్రలు, పిల్లల భోజనం సరిగా ఉందా లేదా అని పరిశీలించి ఫొటోలతో సహా సోమవారంలోగా నివేదిక సమర్పించాలన్నారు.

పనితీరుపై మార్కులు వేయాలని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన వార్డెన్స్, హెచ్‌ఎంలపై చార్జెస్ ఫ్రేమ్ చేస్తామన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా సంక్షేమ అధికారులు యాదయ్య, కోటాజి, ఇలియాజ్ అహ్మద్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మైనార్టీ హాస్టల్ తనిఖీ..

మల్లేపల్లిలోని ప్రభుత్వ మైనార్టీ పోస్టుమెట్రిక్ హాస్టల్‌ను శనివారం రాత్రి కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, వార్డెన్ అంకుష్‌పాష పాల్గొన్నారు.