ట్రోలింగ్‌కు స్పందించిన విద్యార్థిని ప్రాచి నిగం
యూపీ బోర్డ్ పరీక్షలో టాప్‌లో విద్యార్థిని
ఆమె రూపు రేఖలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఈ సంవత్సరం యూపీ 10వ తరగతి బోర్డ్ పరీక్షలో 98.5శాతం మార్కులతో టాప్‌లో నిలిచిన ప్రాచి నిగం తన మీద వస్తున్న ట్రోలింగ్‌కు స్పందించింది. తన రూపురేఖలు కాదు చివరికి పరిగణలోకి వచ్చేవి తన మార్కులని స్పష్టం చేసింది. ‘ నా మీద వస్తున్న ట్రోలింగ్ నన్ను అంతలా బాధపెట్టలేదు. నా మార్కులు పరిగణనలోకి వస్తాయి. కానీ నా రూపురేఖలు కాదు’ అని ఆమె చెప్పింది. సోషల్ మీడియాలో తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. ‘టాప్‌లో నిలిచిన నా ఫోటోను యూపీ బోర్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొందరు అదే పనిగా ట్రోల్ చేశారు. మరికొందరు నాకు మద్దతుగా నిలిచారు, ప్రశంసించారు.. వారందరికి ధన్యవాదాలు’ అని ప్రాచి నిగం తెలిపింది. ప్రాచి నిగం ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకుదారి తీసింది. ఈ క్రమంలో కొందరు విచ్చలవిడిగా ఆమె ముఖంపై ట్రోల్‌చేశారు. మరికొందరు ఆమె కు మద్దతుగా నిలిచి, బోర్డ్ పరీక్షలో తాను చూపిన ప్రతిభకు గాను ప్రశంసించారు. ప్రాచి నిగంతో మాట్లాడిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ముందుగా పరీక్షలో టాప్‌లో వచ్చినందుకు ప్రశంసించారు.