calender_icon.png 27 October, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్క్‌ఫెడ్ ఆదాయాన్ని పెంచాలి

27-10-2024 02:31:27 AM

మార్క్‌ఫెడ్ ఆదాయాన్ని పెంచాలి 

యాసంగిలో ఎరువుల సరఫరా చేయాలి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సచివాలయంలో పంట కొనుగోళ్లపై సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంట కొనుగోలు పూర్తి కాగానే, ఏ మార్కెట్లలో ఎక్కువ ధర ఉందో విచారించి, డిస్పోసల్ చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. శనివారం సచివాలయంలో మార్క్ ఫెడ్, మార్కెటింగ్ అధికారులతో ధాన్యం, పత్తి  కొనుగోళ్ల అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్క్ ఫెడ్ ఆదాయాన్ని పెంచే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ప్రతి ఏటా మార్క్ ఫెడ్‌కు నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చులను సహేతుక పద్ధతుల ద్వారా నిర్వహించాలన్నారు. 

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు ..

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులకు అవసరమైన మద్దతు ధర అందించేందుకు పలు సూచనలు చేశారు. పత్తి ఎమ్మెస్పీ కొనుగోలుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై రైతులకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతరం అవగాహన కల్పించాలని సూచిం చారు. మార్కెటింగ్ అధికారులు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో అవసరమైనంత మేర టార్ఫలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ్ర అనంతరం మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రావు వివరిస్తూ పెసర కొనుగోళ్లు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే 8.03 కోట్లు విలువ గల 924.85 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. మరో రెండు రోజులు మాత్రమే మార్కెట్లలోకి పెసరు పంట వస్తుందని పేర్కొన్నారు. రూ .35.86 కోట్లు వె చ్చి ంచి 4,793 రైతుల వద్ద నుండి 7,330.50 మెట్రిక్ టన్నుల సోయాచిక్కుడు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 50వేల టన్నులు వచ్చే  అవకాశముందని తెలిపారు.