calender_icon.png 18 October, 2024 | 2:49 PM

రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు

25-07-2024 01:40:31 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు  రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక పన్ను ప్రభావం బుధవారమూ కొనసాగింది.హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం పై చూపింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు దీనికి తోడయ్యాయి.

దీంతో ఓ దశలో 650 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా.. ఆఖరులో కొంతమేర కోలుకొంది.సెన్సెక్స్ ఉద యం 80,343.38 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,429.04) నష్టాల్లో ప్రారంభమైంది. దాదాపు రోజంతా నష్టాల్లోనే కొన సాగింది.  ఇంట్రాడేలో 79,750.51 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 65.55 పాయింట్ల నష్టం తో 24,413.50 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద స్థిరపడింది. 

సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి.