ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు మంగళవారం కూడా ఫ్లాట్‌గా ముగిశాయి. గరిష్ఠాల వద్ద మరోసారి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు.. స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు దీనికి తోడయ్యాయి. అమెరికా ఫెడ్ సమావేశం మంగళవారం సాయంత్రం ప్రారంభం కానుంది. వడ్డీ రేట్ల పై ఫెడ్ ఏం నిర్ణయం తీసుకుంటుదనేది అంతర్జాతీయ మార్కెట్లు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈసారికి వడ్డీ రేట్లలో కోత ఉండక పోవచ్చన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. సెన్సెక్స్ ఉదయం 81,349.28 పాయింట్ల (క్రితం ముగింపు 81,355.84) వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 81,230.44 - 81,815.27 మధ్య కదలాడింది. చివరికి 99.56 పాయింట్ల లాభంతో 81,455.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.20 పాయింట్ల లాభంతో 24,857.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టా టా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. సన్‌ఫార్మా, ఐటీసీ, హిందుస్థా న్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో చము రు ధర కాస్త దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79.73 డాల ర్లు పలుకుతోంది. బంగారం ఔన్సు 2386 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.