calender_icon.png 21 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెటింగ్ పనులు నిరాశజనకం

21-01-2025 02:11:43 AM

* సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): మార్కెటింగ్ ఇంజినీ రింగ్ విభాగంలో చేపట్టిన పనుల పురోగతి  నిరాశజనకంగా ఉందని, ప్రతీనెల పనుల పురోగతిని సమీక్షించి, నివేదికలు సమర్పించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సోమవారం రివ్యూ నిర్వహించారు. జిల్లాల వారీగా పనుల పురోగతి అడిగితెలుసుకున్నారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్లకి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఉందని, ఒకవేళ పరిష్కారం వారి స్థాయిలో లేనట్లయితే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యంగా నిర్ధేశించుకొని, 18 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు వివరించారు.  ఇంకా రైతుల వద్ద మిగిలిన పత్తిని కూడా సేకరించాలని ఆదేశించారు.