రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడు పీ ఉదయ్ కుమార్
కొహెడలో స్థలాన్ని పరిశీలించిన గడ్డిఅన్నారం మార్కెట్ పాలకవర్గం
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 22: కొహెడలో గడ్డిఅన్నారం మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు ఎల్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో నిర్మించబోయే మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు.
నూతన మార్కెట్ నిర్మాణ డీపీఆర్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడేలా సకల సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మిస్తామన్నారు. తర్వలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర్‌చారి, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, నవరాజ్, అంజయ్య, మచ్చేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.