calender_icon.png 19 November, 2024 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిదుడుకుల్లోనే మార్కెట్ కదలికలు

11-11-2024 12:33:31 AM

ఈ వారం స్టాక్స్ ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు


న్యూఢిల్లీ, నవంబర్ 10:   ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్ త్వరలో వెలువడే స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల చివరి విడత ఫలితాలు, గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ తదితర అంశాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెప్పారు. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా స్టాక్ ఎక్సేంజీలకు సెలవు. అంతర్జాతీయ క్రూడ్ ధరల కదలికలు, రూపాయి/డాలర్ పెయిర్ ట్రెండ్ కూడా ఈ వారం మార్కెట్  దిశను నిర్దేశిస్తుందని అనలిస్టులు వివరించారు.

పలు అంశాలతో ముడిపడిన ఈ వారంలో కూడా మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు.  గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 237 పాయింట్ల తగ్గుదలతో 79,486 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 156 పాయింట్ల మేర క్షీణించి 24,148 పాయింట్ల వద్ద ముగిసాయి. యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై గ్లోబల్ మార్కెట్ల స్పందన కొద్ది రోజులపాటు ఉంటుందని, తదుపరి యూఎస్ జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఫెడ్  వడ్డీ రేట్లు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. 

కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి వరకూ పదవీ బాధ్యతలు చేపట్టరని,అందుచేత సమీప భవిష్యత్తులో మార్కెట్ దిశను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేట్ ఫలితాల విశ్లేషణ, ఇటీవలి డౌన్‌ట్రెండ్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుందని మోజో పీఎంఎస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ సునీల్ దాల్మియా చెప్పారు. 

ఐదు రోజుల్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 20,000 కోట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసాగుతున్నది. నవంబర్ తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.20,000 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ నెల మొ త్తంలో రికార్డుస్థాయిలో రూ. 95,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు. ఇప్పటివరకూ 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు విత్‌డ్రా చేసుకున్న రూ. 61,973 కోట్లే అత్యధికం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఏడాది గరిష్ఠంగా రూ.57,724 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన విదేశీ ఫండ్స్ ఆ మరుసటి నెలలోనే రికార్డు విక్రయాలు జరపడం గమనార్హం.

మొత్తం మీద 2024లో ఇప్పటివరకూ ఈ ఫండ్స్ భారత మార్కెట్లో రూ.13,000 కోట్లకుపైగా నికర విక్రయాలు జరిపాయి. రాను న్న రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కెట్ ట్రెం డ్‌ను నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నా యర్ చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్‌ల పరస్పర దాడులు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగ డం, చైనా ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ఆ కర్షణీయంగా మారడం వంటి అంశాలు దేశీయ మార్కెట్లో ఎఫ్‌పీఐలను అమ్మకాలకు పురికొల్పాయని విశ్లేషకులు తెలిపారు.

ఇటీవల యూ ఎస్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం కూడా భారత్ మార్కెట్ నుంచి చౌకగా ఉన్న మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నిధులు తరలించడానికి మరో కారణమని వినోద్ నాయర్ చెప్పారు. చైనా మార్కెట్లో  అర్బిట్రేజ్ అవకాశాల్ని వారు అందిపుచ్చుకుంటున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.

చైనాకు మళ్లడమే కారణం

ఇటీవలి ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధా న కారణం చైనాలోకి పెట్టుబడుల్ని మళ్లించడమేనని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. చైనా ఈక్విటీలు ఆకర్షణీయమైన విలువలకు ట్రేడ్‌కావడం, ఆ కంపెనీలు అధిక వృద్ధి సాధించే అవకాశా లు కన్పించడం, చైనా ప్రభుత్వం  పలు ఉద్దీపన చర్యలు తీసుకోవడం ఎఫ్‌పీఐలను ఆకర్షించిందని వివరించారు.

ఐదా రు వారాలుగా భారత్ మార్కెట్లో కరెక్షన్ జరిగినప్పటికీ, స్టాక్ విలువలు ఇతర మా ర్కెట్లతో పోలిస్తే అధికమేనని, మరోవైపు కార్పొరేట్ల ఫలితా లు అంచనాలకంటే  బ లహీనంగా ఉన్నందున, దేశీయ కంపెనీల వృద్ధి అవకాశాలపై ఆందోళనలు నెలకొన్నాయని శ్రీవాస్తవ చెప్పారు. 

12న ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా 

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాల్ని విడుదల చేస్తుంది. టోకు ద్రవ్యోల్బణం డేటా నవంబర్ 14న వెలువడుతుంది. అలాగే నవంబర్ 13న వెలువడే యూఎస్ ద్రవ్యోల్బణం నివేదిక కూడా మార్కెట్లకు కీలకమేనని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు.

యూఎస్ ద్రవ్యోల్బణం తదుపరి ఫెడ్ పాలసీపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ప్రధాన అంతర్జాతీయ అంశాలు (యూఎస్ ఎన్నికలు, ఫెడ్ మీట్), బ్లూచిప్ కంపెనీల ఫలితాల వెల్లడి ముగిసినందున, ఇక కీలకమైన సూక్ష్మ ఆర్థిక గణాంకాలు, చివరిదశ కార్పొరేట్ ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని వివరించారు. 

కార్పొరేట్ల క్యూ 2 ఫలితాలు

ఈ వారం వెలువడే దేశీ కార్పొరేట్ల తుది దశ క్యూ2 ఫలితాలు స్టాక్స్‌వారీగా కదలికలకు కారణమవుతాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఈఎంఎల్, హిందా ల్కో, ఓఎన్‌జీసీ, అపోలోటైర్స్ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు వెలువడతాయి.