calender_icon.png 18 November, 2024 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు

11-11-2024 11:59:13 PM

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు..చివరికి ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, నిరాశాజనక క్యూ2 ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఐటీ, బ్యాంక్ స్టాక్స్ రాణించాయి. సెన్సెక్స్ 80 వేలు, నిఫ్టీ 24,150 దిగువన ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 79,298.46 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,486.32) నష్టాల్లో ప్రారంభమైంది.

ఇంట్రాడే కనిష్టాల నుంచి దాదాపు 900 పాయింట్లు పైకెగసిన సెన్సెక్స్.. 80,102.14 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 9.83 పాయింట్ల లాభంతో 79,496.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 6.90 పాయింట్ల నష్టంతో 24,141.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.39గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్య్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73 డాలర్ల వద్ద ట్రేడుతుండగా.. బంగారం ఔన్సు 2678 డాలర్ల వద్ద కొనసాగుతోంది.