calender_icon.png 9 February, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి విలువ నిర్ణయించేది మార్కెట్ శక్తులే

09-02-2025 12:59:23 AM

* ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా

న్యూఢిల్లీ:  దేశీయ కరెన్సీ రూపాయి విలు వ క్షీణించడంపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డాలరుతో రూపా యి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.  రూపాయి విలువ రోజు వారీ మార్పులపై ఆర్‌బీఐ పెద్దగా ఆందోళన చెందబోదని అన్నారు. దీర్ఘకాల, మధ్యస్థ కాలంలో రూపాయి విలువ మార్పుపైనే ఆర్‌బీఐ దృష్టిపెడుతుందన్నారు.

శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం డాలరుతో రూపాయి మార కం విలువ 87.50గా ఉంది. ఆర్‌బీఐ తాజా గా రెపో రేటును సవరించిన నేపథ్యంలో తొమ్మిది పైసలు బలపడింది. ఈ నేపథ్యం లో మీడియా ప్రతినిధులనుంచి రూపాయి పతనంపై ప్రశ్న ఎదురవగా ఆర్‌బీఐ గవర్నర్ స్పందించారు.‘

రూపాయి విషయంలో ఆర్‌బీఐ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. రూపాయి విలు స్థాయిని గానీ, ఒక బ్యాం డ్‌ను కానీ మేము చూడబోం.ఎప్పుడైనా భారీ స్థాయిలో ఒడిదొడుకులు  ఎదుర్కొం టే జోక్యం చేసుకుంటాం రోజువారీ విలువ తగ్గడం, పెరగడం గురించి పట్టించుకోం’ అని ఆయన పేర్కొన్నారు.

రూపాయి విలువ 5శాతం క్షీణిస్తే దేశీయంగా ద్రవ్యోల్బణంపై 3035 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను రూపొందించినప్పుడు ప్రస్తుత డాలరు రూపాయి విలువను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్లే రూపాయి విలువ క్షీణిస్తోందన్నారు.

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుట్రంప్ సుంకాలపై చేస్తున్న ప్రకటనలు ఇందుకు కారణమవుతున్నాయన్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు  మల్హోత్రా చెప్పారు. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి దోహదం చేస్తుందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని, అవసరమయినప్పుడు వినియోగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.