14-02-2025 12:41:17 AM
కామారెడ్డి, ఫిబ్రవరి ౧౩ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి మృతి చెందిన ఘటన గురువారం తెల్ల వారుజామున చోటుచేసు కుంది. కామారెడ్డి పట్న పరిధిలోని దేవుని పల్లి కి చెందిన నర్సింలు గత 8 సంవత్స రాలుగా కామారెడ్డి మార్కెట్ కమిటీ కార్య దర్శిగా పనిచేశారు.
ఇటీవలనే భిక్కనూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా బదిలీపై వెళ్లా రు. అందరితో కలుపుగోలుగా ఉండే నర్సిం హులు గురువారం ఉదయం వాకింగ్కు వెళ్లి ఇంటికి రాగా కాసేపటికే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయా డని కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్ప టికే నర్సింలు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వివరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు మృతి పట్ల బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగొని లక్ష్మి పాలకవర్గ సభ్యులు కుటుంబ సభ్యులకు ప్రగాడ సాను భూతిని వ్యక్తపరిచారు.