calender_icon.png 3 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 20వేల ఆర్థిక సాయం

02-04-2025 12:30:45 AM

కడ్తాల్, ఏప్రిల్ 1(విజయక్రాంతి ): కడ్తాల్ మండలంలోని పల్లెచెలుక తండా గ్రామపంచా యతీలో ఇటీవల మృతి చెందిన పలు బాధిత  కుటుం బాలకు జర్పుల రాధా కృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 20వేల  ఆర్థిక సాయం అందించింది.

మంగళవారం ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పల్లెచెలక తండాలో మృతి చెందిన విస్లావత్ రాజు, విస్లావత్ శ్రీను, విస్లావత్ రాము, మేరావత్ వెంకటయ్య కుటుంబాలను పరామర్శించారు.

అనంతరం ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున నాలుగు కుటుంబాలకు 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తన ట్రస్ట్ ద్వారా అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లోకేష్ నాయక్, లాల్ కోట నరసింహ గౌడ్, హరిచంద్ నాయక్, మాజీ ఎంపిటిసి ప్రియా రమేష్, మాజీ ఉపసర్పంచ్ శారద పాండు, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.