22-04-2025 01:27:26 PM
మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపన్న హస్తం అందించడం జరుగుతుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మురగుండ్ల అనంతరాములు అనారోగ్యానికి గురికాగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ దృష్టికి తీసుకు వెళ్ళగా బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయించారన్నారు. మంగళవారం బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. పేదలకు సీఎం సహాయనిది ఎంతో మేలు చేస్తుందన్నారు.