calender_icon.png 1 February, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరమశివుడు మెచ్చిన భక్తుడు మార్కండేయుడు...

01-02-2025 05:29:09 PM

జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): పరమశివుని అనుగ్రహంతో అమరజీవిగా వరాలు పొందిన మార్కండేయునీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శ్రీ మార్కండేయుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ లోని శివ మార్కండేయ ఆలయంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ మార్కండేయ జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. ఆలయ పునర్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎండోమెంట్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గాన్ని అలవర్చుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, అలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.