నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో మార్కండేయ జయంతిని శనివారం జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి పార్టీ నాయకులు రావుల రామనాథ్ రచ్చ మల్లేష్ తదితరులు మార్కండేయ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ఈ బడ్జెట్ ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు.