calender_icon.png 13 February, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పట్టణ మహిళ విభాగం అధ్యక్షురాలిగా మార్క పద్మ

13-02-2025 12:00:00 AM

సిద్ధిపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మహిళల అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజలు హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. బుధ వారం కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఆఫీసులో సిద్ధిపేట పట్టణ మహిళ విభాగం అధ్య క్షులుగా మార్క పద్మను నియమిస్తూ నియా మక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మహిళలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు.

ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించామన్నారు. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు మహిళ గ్రూపు సంఘాలకు ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను కేటాయించిందన్నారు. గత ప్రభుత్వంలో మహిళను కించపరిచే విధంగా చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మంత్రుల పదవి ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పయ్యా వుల ఎల్లం, సిద్దిపేట అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షులు వహాబ్, యువజన విభాగం అధ్యక్షులు గయాజుద్దీన్, మంద పాండు, అజ్మత్, రజిని  పాల్గొన్నారు.