పాల్వంచ (విజయక్రాంతి): మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం కారు, ఆటో ఢీకొనగా ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వారిని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజుదొరతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కొత్వాల కోరారు. క్షతగాత్రుల బంధువులకు దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, గంధం నరసింహారావు, దారా చిరంజీవి, మాలోత్ కోటి నాయక్, కొండం పుల్లయ్య, కుమార్, జగన్నాధపురం గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.