calender_icon.png 15 March, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ

14-03-2025 11:06:38 PM

గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడాకు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పని చేసిన కార్నీ

న్యూఢిల్లీ: కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టారు. జస్టిన్ ట్రూడో వారసుడిగా లిబరల్ పార్టీ తరఫున కార్నీని ఎన్నుకుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కెనడా మీద సుంకాల భయం పెట్టారు. దీంతో కెనడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ కెనడా మీద విధించిన సుంకాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం సుంకాలు విధించడం మాత్రమే కాకుండా కెనడా మీద ఆధిపత్యం కోసం కూడా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రధాని కార్నీ 60వ పడిలోకి అడుగుపెట్టారు. ఇంతకు ముందు ప్రధానిగా పని చేసిన ట్రూడో దాదాపు పదేండ్ల పాటు విధులు నిర్వర్తించారు. కార్నీ ఇంతకు ముందు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పని చేశారు. కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అమెరికాెేకెనడాల మధ్య ఉద్రిక్తతలు పురుడు పోసుకుంటున్న సమయంలో కార్నీ ప్రధానిగా పదవి చేపట్టారు.