calender_icon.png 14 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహోద్యోగి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

12-11-2024 01:14:20 AM

సూర్యాపేట, నవంబర్ 11(విజయక్రాంతి): సహోద్యోగి వేధింపులను భరిం చలేక  వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘట న సోమవారం చోటు చేసుకున్నది. మృ తురాలి కుటుంబీకులు, స్థానికుల కథ నం మేర కు.. సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని చంద్రన్నకుంటలో నివాసం ఉంటున్న కొత్తపల్లి కిరణ్మయి(30)..

లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. కొద్ది రోజులుగా సహోద్యోగి అయిన పవన్ నుంచి వేధింపులు మొ దలయ్యాయి. ఈక్రమంలో అక్టోబర్ నెల జీతం కోసం సోమవారం ఆసుపత్రికి వచ్చిన కిరణ్మయిని పవన్‌తో పాటు మరో ఉద్యోగి దుర్భాష లాడారు.

జరిగిన విషయాన్ని తన తల్లికి  చెప్పిన కిరణ్మయి నివాసానికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని ఆసుపత్రి ఎదు ట ఉంచి ఆమె మృతికి కారణమైన పవన్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. కిరణ్మయికి భర్త ప్రవీణ్‌తో పాటు కూతరు వేదశ్రీ, కుమారుడు కృతిక్ ఉన్నారు.