calender_icon.png 4 October, 2024 | 6:52 AM

వైవాహిక అత్యాచారం నేరంగా చూడలేం

04-10-2024 01:32:34 AM

సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిం చిం ది. ఇందుకు సంబంధించిన శిక్షలు ఉన్నాయని, ఇది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్యగా కేంద్రం పేర్కొంది. అందువ ల్ల ఈ సమస్య సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొంది.

దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీని పై కేంద్రం అభిప్రాయాన్ని కోర్టు కోరగా.. పిటిషన్లను ప్రభుత్వం వ్యతిరేకించింది.

మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే అత్యా చారంగా పరిగణించలేమని పేర్కొంది. నేరంగా పరిగణిస్తే దాంపత్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని, వివాహ వ్యవస్థ కుంగిపోతుందని తెలిపింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణ యం తీసుకోలేమని స్పష్టం చేసింది.