మణుగూరు, నవంబర్ 25: కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో గంజాయిని ఎస్సై రాజేష్ సోమవారం పట్టుకున్నారు. సోమవారం వాహనా ల తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో తరలిస్తున్న రూ.3.82 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది.
కారుతోపాటు నలుగురు నిందితుల ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన శ్యామల్ సర్కార్, మధ్యప్రదేశ్ రాష్ట్రం మురేనా జోర జిల్లా సిక్రొడ గ్రామానికి చెందిన దీవన్ సింగ్ కుస్వ, మున్షి కుస్వ, రాజిపాల్ కుస్వ ఉన్నట్టు పాల్వంచ సీఐ వినయ్‌కుమార్ తెలిపారు.