calender_icon.png 13 March, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయ్యారంలో రూ.10లక్షల గంజాయి పట్టివేత

13-03-2025 12:50:43 AM

వివరాలు వెల్లడించిన గార్ల బయ్యారం సీఐ రవికుమార్

మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం  మండలకేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన ఎండుగంజాయిని బయ్యారం  పోలీస్‌లు మంగళవారం పెట్టుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి వివరాలను  గార్ల బయ్యారం సిఐ రవికుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు  మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలో మంగళవారం సుమారు ఉదయం 9  గంట ల సమయంలో  మెయిన్ సెంటర్‌లో బయ్యారం ఎస్త్స్ర తిరుపతి తన సిబ్బందితో  కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఆ.సమయంలో ఇద్దరు వ్యక్తులు  అనుమానస్పదం గా ఒక బ్యాగ్ తో కనిపించారు. అనుమానం వచ్చి వెంటనే ఇద్దరు  పంచులను పిలిపించి వారి సమక్షంలో ఆ బ్యాగును తనిఖీ చేసి చూడగా,  ఆ బ్యాగ్‌లో  గంజాయి ఉంది.

వెంటనే వాటిని పంచుల సమక్షంలోనే బయ్యారం మెయిన్ సెంటర్  నందు తూకం వేయగా సుమారు 20 కిలోల ఎండు గంజా యి ఉంది.  వీటి విలువ  సుమారు పది లక్ష ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా ఈ గంజాయి  అమ్ముతున్న సంతోష్ నాయ క్ ఒడిస్సా రాష్ట్రం పత్రాపూర్ గ్రామం కాగా,  మరొకరు  అర్జున్ దాస్ ఒడిస్సా రాష్ట్రం సిరిసింగి గ్రామంగా తెలిపారు.

ఎస్‌ఐ తిరుపతి  ఇద్దరిని  పంచుల సమక్షంలో అదుపులో తీసుకొన్న గంజాయిని సీజ్ చేసి పిఎస్ కు తీసుకొని  వచ్చి బయ్యారం ఎస్‌ఐ  దరఖాస్తు ఇవ్వగా గార్ల  బయ్యారం సిఐ బి రవికుమార్  కేసు  నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.