26-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) :- కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు లో కూసుమంచి ఎస్ ఐ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేయుచుం డగా రాత్రి 8.30 గంటల సమయంలో కూసుమంచి వైపు నుండి ఖమ్మం వైపుగా మరిపెడబంగ్లా మీదుగా పూణే వెళ్ళటానికి వస్తున్న కారును అనుమానంతో తనిఖీ చేయగా కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు నుంచి 8 బస్తాలు లో ఉన్న 90 పాక్కెట్ లు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పంచనామా నిర్వహించి నిందితులైన పల్లపు రఘు, మహ్మద్ ఖాజా పాషాను అరెస్ట్ చేశారు. నిందితులు ఒడిషాలోని బా బు, సుబ్బు, రామాంజనేయులు వద్ద నుండి గంజాయిని తక్కువు రేట్ కి కొనుగోలు చేసి పూణేలోని సొహైల్ అనే అతనికి ఎక్కువ లాభాలకు అమ్ముతుంటారని దీనినే వ్యపారంగాపోలీసులు తెలిపారు. వారి నుండి సుమారు రూ. 89 లక్షల 43 వేల విలువైన 178.870 కిలోల గంజాయి, మహీంద్రా వాహనం స్వాధీనం చేసుకున్నారు.