calender_icon.png 20 April, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 2.32 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

19-04-2025 11:47:32 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో రూ. 2, 31,87 వేల రూపాయల విలువ చేసే గంజాయినీ అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారనీ అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ కరుణాకర్ తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విజయ నగరం నుండి మధ్యప్రదేశ్ లోని అగర మాల్వా ప్రాంతానికి 216 ప్యాకెట్ల గంజాయినీ సమాచారంతో ఎస్-2 యయాతి రాజు తన సిబ్బందితో సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారని ఆయన తెలిపారు. లారీలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి తరలిస్తున్నారని అంగీకరించారని, లారీలో తనిఖీ చేయగా 216 ప్యాకెట్ల గంజాయి దొరికింది అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.