calender_icon.png 22 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర నుంచి నగరానికి గంజాయి రవాణా

11-04-2025 12:41:24 AM

 కిలో సరుకు స్వాధీనం, వ్యక్తి అరెస్ట్ 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 10: మహారాష్ట్రలోని అమరావతిలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి అవసరమైన వారికి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి కిలోగంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు.

పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన షేక్ జాకీర్ ఇటీవల కాచిగూడ నుంచి రైలులో మహారాష్ట్రలోని అమరావతికి వెళ్ళాడు. అక్కడ తక్కువ ధరకు కిలో గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి ఈనెల 8 న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి చిన్నచిన్న ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకొని గురువారం రిమాండుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సరుకు విలువ 20,000 ఉంటుందన్నారు.