calender_icon.png 8 January, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రేతల అరెస్టు

08-01-2025 12:35:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(విజయక్రాంతి):  ఎక్సుజ్ ఎస్టీఎఫ్ టీమ్ పోలీసులు మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి, పాపీస్ట్రాను పట్టుకున్నారు. అమీర్‌పేట్ ఎక్సుజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుద్వారా సమీపంలో పాపీస్ట్రా అమ్మకాలు చేపడుతున్న సర్దార్ రోషన్ సింగ్‌ని అదుపులోకి తీసుకున్న ఎస్టీఎఫ్ పోలీ  1.3 కిలోల పాపీస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. మ  కేసులో.. నానక్‌రాంగూడలోని ఓ ఇంట్లో గంజాయి అమ్మకాలు చేపడుతున్న మహ్మద్ ఆలంను అరెస్టు చేసిన పోలీసులు 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి చాక్లెట్ల పట్టివేత

విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం మేడ్చల్ తూంకుంటలో తనిఖీలు నిర్వహించిన మేడ్చల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులకు బీహార్‌కు చెందిన చున్‌చున్ ఉపేందర్ మండల్ అనే వ్యక్తి ఇంట్లో 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు లభించాయి. బీహార్‌కు చెందిన ఉపేందర్ తూంకుంటలో ఒక పాన్‌షాప్ నిర్వహిస్తూనే గంజాయి చాక్లెట్ల అమ్మ  సాగిస్తున్నాడు.