12-04-2025 05:17:06 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి మహారాష్ట్ర పూణేకు మహేంద్ర కారులో అక్రమంగా తరలిస్తున్న 51 కేజీల గంజాయిని శనివారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ 28 లక్షల విలువ గల 51 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.