24-02-2025 12:00:00 AM
ఖమ్మం / మధిర ఫిబ్రవరి 23 (విజయక్రాంతి ):- కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తనికీలు చేసి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మధిర ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి ఆదివారం తెలిపారు.
మధిర రైల్వే స్టేషన్ లో రోజు వారి తనిఖీలలో భాగంగా రెండో నెంబర్ ప్లాట్‌ఫాంపై అగి ఉన్న భువనేశ్వర్ నుండి ముంబై సెంట్రల్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగాఅందులో అనుమానస్పదంగా రెండు బ్యాగులు కనిపించగా అట్టి బ్యాగులను తెరిచి చూడగా అందులో 8 కిలోల ఎండు గంజాయిను గుర్తించినట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో మధిర ఎక్సైజ్ సీఐ జె.రామ్మూర్తి , ఎస్సై జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.