హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): ఘట్‌కేసర్, నానక్‌రామ్ గూడలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లో కిలో, నానక్‌రామ్‌గూడలో 1.2 కిలోల గంజాయిని పట్టుకు ని కుమ్మరి గోపి, రంజాన్ అనే వ్యక్తులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.