calender_icon.png 19 February, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత

15-02-2025 01:36:31 AM

ఐదుగురు అరెస్ట్ 

మేడ్చల్, ఫిబ్రవరి 14(విజయ క్రాంతి) రెండు వేరువేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏ , బి టీములు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. 2.330 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి కి చెందిన వేములపల్లి సందీప్, రాజమండ్రి కి చెందిన రామిరెడ్డి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

వీరి వద్ద 1.1 కేజీల గంజాయి, ఒక టూ వీలర్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి నల్లగందుల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న హనుమకొండ కు చెందిన రాకేష్, మధ్యప్రదేశ్ కు చెందిన రామరాజు జైస్వాల్, మనోజ్ కుమార్ సాహూ లను పట్టుకొని శేరిలింగంపల్లి ఎక్సై జ్ పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద 1.230 కేజీల గంజాయి, ఒక బైకు, స్కూటీ, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పట్టుకున్న టీం లో ఎస్త్స్ర బాలరాజు, సిబ్బంది కౌశిక్, సాయికిరణ్, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.