calender_icon.png 22 January, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో గంజాయి కలకలం...!

22-01-2025 04:20:54 PM

1.87 కిలోల గంజాయితో పాటు ఇద్దరు నిందితుల అరెస్ట్

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి(Gachibowli) చిన్న అంజయ్య నగర్ లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి నిందితులను శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 1.87 కిలోల గంజాయి(Marijuana) స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీటీఎఫ్ శంషాబాద్ బృందం(DTF Shamshabad Team) రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.చిన్న అంజయ్య నగర్, గచ్చిబౌలి, నార్సింగిలో తనిఖీలు నిర్వహించగా చిత్తరంజన్ అలియాస్ మున్నా ఒడిశాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి అతని ద్విచక్ర వాహనంలో ఉన్న 1.17 కిలోల పొడి గంజాయి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బిజయ్ బెహరా బాలాజీ నగర్, మంచిరేవుల, నార్సింగి లో ఉంటూ అతని ద్విచక్ర వాహనం టివిఎస్ స్పోర్ట్‌ బైక్ లో 700  గ్రాములు డ్రై గంజాయి తో పాటు వాహనాన్ని  స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ నిందితులు ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారు.విచారణ నిమిత్తం ఇద్దరు నిందితులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.