23-02-2025 03:13:00 PM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): రెండు వేరువేరు కేసుల్లో ఆర్జీఐఏ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. ఆదివారం ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతం సఫిల్ గూడకు చెందిన రోహిత్ అనే యువకుడు ఎయిర్పోర్ట్ బావర్చి సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా స్థానిక పోలీసులతో పాటు ఎస్ఓటి సిబ్బంది దాడులు నిర్వహించి అతడి నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మరోకేసులో.. శంషాబాద్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో స్థానిక పోలీసులు ఎస్వోటీ సిబ్బంది దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 56 గ్రాముల గంజాయితోపాటు నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన బొడ్డు భాను ప్రసాద్, పెద్ద తూప్రా గ్రామానికి చెందిన బేగరి సాయికిరణ్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలియజేశారు.