11-12-2024 02:05:28 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ధూల్‌పేట్ లోని రెండు ఇండ్లలో ఎక్సైజ్, ఎస్టీఎఫ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 2.74కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. మంగళవారం ధూల్‌పేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ కుమ్మరివాడలో దేవేందర్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి అతని వద్ద నుంచి 1.44కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అతన్ని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అప్పర్ ధూల్‌పేట్‌లో సందీప్ సింగ్ ఇంట్లో 1.30కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు, కునాల్ సింగ్ అనే మరో నిం దితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ధూల్‌పేట్ ఎక్సైజ్ సీఐ మధుబాబు, గోపాల్, ఎస్సై మధు, సిబ్బంది.. భాస్కర్‌రెడ్డి, అజీమ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.